అధిష్టానం చేసిన తప్పుల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడుతోంది- కోమటిరెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Samba Siva Rao
Published on: 10 Jan 2021 8:23 PM IST
అధిష్టానం చేసిన తప్పుల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడుతోంది- కోమటిరెడ్డి
X

కోమటి రెడ్డి ఫైల్ ఫోటో 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం వ్యవహారం శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. డిపాజిట్లు కూడా రానీ నేతలు, తెలంగాణాలో పంపిస్తే కాంగ్రెస్ ఎలా బలపడుతుందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడిని ప్రకటిస్తే అసంతృప్తి జ్వాలలు వచ్చే ప్రమాదం ఉందని కాంగ్రెస్ అధిష్టానం వాయిదా వేసింది. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఓ కార్యక్రమానికి వచ్చిన కోమటి రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ... నాకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం, తెలంగాణ రాష్ట్రం అవిర్భవించిన అప్పటి నుంచి కాంగ్రెస్ అధిష్టానం చేసిన తప్పుల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని అన్నారు.

దీంతో కోమటిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీలోకి వెళ్తానంటూ ప్రకటన చేసి కాంగ్రెస్ లో కలకలం రేపారు. మరోసారి మాట్లాడిన ఆయన.. అసలు సాగర్ ఉపఎన్నికకు, పీసీసీ ఎంపికను ముడిపెట్టడం ఏంటి.? అధిష్టానం సొంతంగా నిర్ణయం తీసునే పరిస్థితుల్లో లేదని ఇట్టే అర్థం అవుతోంది' అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధిష్టానం తమ కృషిని గుర్తించడంలేదని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికి రాష్ట్ర రాజకీయాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందనీ, అభిమానులు ఎవరూ బాధపడొద్దని రాజగోపాల్ రెడ్డి ధైర్యం చెప్పారు. పార్టీకోసం కష్టపడే వారిని అధిష్టానం గుర్తించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హితవు పలికారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story