Komatireddy Lakshmi: భర్త విజయంకోసం భార్య ఎన్నికల ప్రచారం

Komatireddy Lakshmi: రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని లక్ష్మీ ఇంటింటి ప్రచారం

Rama Rao
Published on: 22 Oct 2022 6:45 AM IST
Komatireddy Lakshmi Door-to-Door Campaign to Win Raj Gopal Reddy
X

Komatireddy Lakshmi: భర్త విజయంకోసం భార్య ఎన్నికల ప్రచారం

Komatireddy Lakshmi: మునుగోడు ఎన్నికల ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. భర్త గెలుపుకోసం భార్య ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మి ఎన్నికల ప్రచారం చేపట్టింది. రాజగోపాల్ రెడ్డి విజయానికి సహకిరించాలని మర్రిగూడ మండలంలో ఓటర్లను అభ్యర్థించింది. గ్రామాలలో గడపగడపకు ప్రచార నిర్వహించారు. మర్రిగూడ మండలంలోని ఎర్రగండ్లపల్లి, రామ్‌రెడ్డిపల్లి, అంతంపేట గ్రామాలలో ప్రచారం కొనసాగింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డికి ఆయా గ్రామాల్లో మహిళలు ఘన స్వాగతం పలికారు. ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేసి గెలిపించమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని అసెంబ్లీకి పంపిస్తే మూడున్నర ఏండ్లు ఎంత కొట్లాడిన కూడా అభివృద్ధికి ఈ కేసీఆర్ సర్కారు నిధులు ఇవ్వలేదని రాజీనామా చేస్తే కనీసం ఈ ప్రాంతానికి నిధులు వస్తాయని ఉద్దేశంతోటి రాజీనామా చేసి మళ్లీ మీ ముందుకు వచ్చి న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని గడపగడపకు తిరుగుతూ కోరారు లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి.

కరోనాకాలంలో ఇబ్బంది పడుతున్న సందర్భంలో తమ నియోజకవర్గ ప్రజలు ఉపవాసం ఉండొద్దని ఉద్దేశంతో 50 వేల కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారన్నారు. కోమటిరెడ్డి సుశీలమ్మ పేరు మీద ఎంతో మంది పేదలకు కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసిన ఘనత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిదని. ఆపదలో ఆదుకునే గుణం ఉన్న వ్యక్తి అన్నారు. కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తే తమ సొంత బిడ్డల మునుగోడు ప్రజల్ని చూసుకుంటారని ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తు ఉన్న కరపత్రాలను ప్రతి వ్యక్తికి పంచుతూ కమలం పువ్వు గుర్తుని గడపగడపకు తీసుకెళుతున్నారు లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి. లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి తో పాటు నాగార్జున సాగర్ నియోజకవర్గ బీజేపీ నాయకురాలు కంకణాల నివేదిత రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.

Rama Rao

Rama Rao

Next Story