ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై కోమటిరెడ్డి వర్గం గుర్రు...

Komatireddy Brothers: రేవంత్ నిర్వహించిన సన్నాహక సమావేశానికి హాజరైన ఉత్తమ్...

Shireesha
Updated on: 30 April 2022 1:30 PM IST
Komatireddy Brothers Team Angry on Uttam Kumar Reddy for Attending Revanth Reddy Meeting | Nalgonda
X

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై కోమటిరెడ్డి వర్గం గుర్రు...

Komatireddy Brothers: ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో కొత్త టాక్ నడుస్తోంది. రాహుల్‌గాంధీ వరంగల్ సభ సన్నాహక సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకావడంతో ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్‌లో రాజకీయం మారుతుందా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని నల్గొండలో అడుగుపెట్టనీయబోమన్న ఉత్తమ్, కోమటిరెడ్డిల్లో మాజీ పీసీసీ చీఫ్ మనసెందుకు మార్చుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.

జానారెడ్డిని తెరపైకి తీసుకువచ్చి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నల్గొండ కాంగ్రెస్‌లో పట్టు సాధించడంలో సక్సెస్ అయ్యారనే టాక్ వస్తోంది. ఏఐసీసీలో కీలకపదవిలో ఉన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే సమావేశం కోసం నిర్వహించే సన్నాహక సమావేశానికి రాకుంటే... రాంగ్ ఇండికేషన్ వెళ్తుందనే ముందు జాగ్రత్తతో రేవంత్‌తో వేదిక పంచుకున్నారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

Shireesha

Shireesha

Next Story