Komatireddy Brothers: అన్నీ ఊహించే వ్యూహం మార్చారా?

Komatireddy Brothers Strategy on Nalgonda MLC Elections
x

Komatireddy Brothers: అన్నీ ఊహించే వ్యూహం మార్చారా?

Highlights

Komatireddy Brothers: కోమటిరెడ్డి బ్రదర్స్‌ ముందే ఊహించారా? అందుకే వ్యూహం మార్చారా?

Komatireddy Brothers: కోమటిరెడ్డి బ్రదర్స్‌ ముందే ఊహించారా? అందుకే వ్యూహం మార్చారా? హస్తం పార్టీతో, మరీ ముఖ్యంగా రేవంత్‌పై వివాదంతో సహాయ నిరాకరణ చేస్తున్న అన్నదమ్ములు ఎమ్మెల్సీ ఫలితాలను ముందే పసిగట్టారా? అందుకే జిల్లాపై మంచి పట్టు ఉన్నా ఎన్నికలకు దూరంగా ఉన్నారా? తాజా ఫలితాలతో కోమటిరెడ్డి వ్యూహంపై కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చేంటి? బ్రదర్స్‌ స్ట్రాటెజీపై నేతల్లో వినిపిస్తున్న మాటలేంటి?

కోమటిరెడ్డి ఫ్యామిలీ తెలంగాణ కాంగ్రెస్‌కు ఆయువుపట్టులాంటిది. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ అయ్యాక, హస్తంతో అంటీ ముట్టనట్టు ఉంటున్న బ్రదర్స్‌ కొన్నాళ్ల నుంచి యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. రేవంత్‌రెడ్డిపై వివాదంతో సహాయ నిరాకరణ చేసిన అన్నదమ్ములు కలసికట్టుగా పావులు కదుపుతున్నారు. మొన్నటి దాకా, కోమటిరెడ్డి బ్రదర్స్‌ని పార్టీ హైకమాండ్‌ లైట్‌ తీసుకున్నా స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆ జిల్లాపై ఆ ఫ్యామిలీ పట్టేంటో గుర్తించి ఏవో బాధ్యతలు కూడా అప్పగించింది. అందుకే నల్లగొండ జిల్లాలో పోటీకి దిగాలని నామినేషన్ల చివరి రోజు వరకు హస్తం పార్టీ కీలక నేతలు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. గట్టి పోటీనిచ్చే బలమున్నా పార్టీ బరి నుంచి తప్పుకోవడంపై రకరకాల అభిప్రాయలు వినిపించాయి. కానీ అన్నీ ఆలోచించే కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో పెద్దగా రెస్పాండ్‌ కాలేదన్న చర్చ ఇప్పుడు హస్తం పార్టీలో వినిపిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా మాస్ లీడర్లుగా పేరున్న కోమటిరెడ్డి బ్రదర్స్ సొంత జిల్లా అయిన నల్లగొండలో ఎవ్వరికి లేనంత పట్టును కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌ గడ్డు కాలంలో ఉన్నప్పుడు ఈ బ్రదర్స్‌ ఏకమై పార్టీని పరుగులు పెట్టించారు. హస్తం అస్తవ్యస్థంగా కొనసాగుతున్న రోజుల్లో కూడా అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భువనగిరి ఎంపీగా తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేసి తమకున్న వ్యక్తిగత పలుకుబడితో గెలుపొందారు. అయితే రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ అయ్యాక కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పీసీసీ పదవిని రాకపోవడంతో అలిగిన వెంకట్‌రెడ్డి వీలు దొరికినప్పడల్లా రేవంత్‌పై రెచ్చిపోయేవారు. పోటీలో ఉన్న వారితో కనీసం చర్చింకుండా అధిష్టానం ఏకపక్షంగా పీసీసీని ప్రకటించపోవడాన్ని ఈ బ్రదర్స్‌ జీర్ణంచుకోలేకపోయారు. కొత్త పీసీసీ ఎంపిక నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఎక్కడా హాజరు కాకుండా కేవలం వారి, వారి నియోజికర్గాలల్లో సమస్యలు జిల్లా సమస్యలపైనే పోరాటం చేస్తూ వచ్చారు. కానీ మొన్నీ మధ్య రేవంత్‌ చేపట్టిన ఓ కార్యక్రమానికి హాజరై తామంతా ఒక్కటేనని చాటిచెప్పినంత పని చేశారు.

అయితే, అంతకుముందు వరకు కూడా రాష్ట్ర పార్టీ ఇప్పటివరకు కోమటిరెడ్డి బ్రదర్స్‌ను లైట్‌గా తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు వాళ్లు వచ్చినా రాకున్నా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత సీన్‌ కట్‌ చేస్తే స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సరికి నల్గొండ జిల్లా పోటీపై కోమటిరెడ్డి బ్రదర్స్‌ను సంప్రదించాల్సి వచ్చింది. వాళ్లిద్దరూ అంగీకరిస్తేనే కానీ, అక్కడ పార్టీ అభ్యర్థిని ఎన్నికల రంగంలోకి దించలేని పరిస్థితి వచ్చిందని పార్టీలో చర్చ జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఉన్నా కోమటిరెడ్డి బ్రదర్స్ అంగీకారం తప్పని సరైందట కానీ అక్కడే పరిస్థితి ఇంకోలా మారిందట.

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్‌ చివరి రోజు వరకు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ నల్లగొండ జిల్లాలో పోటీకి తాము సహకరించలేమని పదే పదే చెప్పడంతో అధిష్టానం చేతులెత్తయ్యాల్సి వచ్చిందని పార్టీలో కొందరు నేతలు చెప్పుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి బంధువును పోటీలో నిలపడానికి ఒప్పుకున్నా బ్రదర్స్‌ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో వెనుకడుగు వేయాల్సి వచ్చిందట. కోమటిరెడ్డి అన్నదమ్ములు ఒప్పుకొని ఉంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో, టీఆర్ఎస్‌కు పోటీగా కాంగ్రెస్ గట్టిగా నిలబడి ఉండేదని, ప్రత్యర్థులు ఎవరికైనా ముచ్చెమటలు పట్టేవన్న టాక్‌ వినిపిస్తోంది. కానీ, అన్నీ గమనించిన అన్నదమ్ములు కాంగ్రెస్‌ అభ్యర్థిని పోటీలో దించితే, ఓటమి భారంతో ఉన్న పరువు కాస్త పోయే ప్రమాదం ఉందని గ్రహించే పోటీకి దూరంగా ఉన్నారన్న చర్చ జరుగుతోందిప్పుడు.

కాంగ్రెస్‌ పార్టీలో, ఇంకా చెప్పాలటే, నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఉన్న ప్రయారిటీ ఏంటో ఇప్పుడు అధిష్టానానికి తెలిసి వచ్చిందని చెప్పుకుంటున్నారు వాళ్ల అనుచరులు, అభిమానులు. అన్నదమ్ములకు ఇప్పటికైనా సరైన గుర్తింపునివ్వకుంటే, రాజకీయంగా హస్తం పార్టీకి భారీ నష్టమే జరుగుతుందని వారంటున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డిలాంటి ఉద్దండ రాజకీయ నేతలు ఉన్నా పార్టీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ని దూరం చేసుకుంటే చాలా కష్టమన్న భావన వ్యక్తమవుతోంది. మరి కాంగ్రెస్‌ అధిష్టానం ఆలోచన ఏంటో, వారి వ్యూహ సామర్థ్యం ఏ మేరకు గ్రహించిందో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories