అన్న బాటలో తమ్ముడు.. కాంగ్రెస్‌‌లో ఇక కుమ్ముడేనా?

Komatireddy Brothers Back in Congress
x

అన్న బాటలో తమ్ముడు.. కాంగ్రెస్‌‌లో ఇక కుమ్ముడేనా?

Highlights

Congress: కోమటిరెడ్డి బ్రదర్స్‌. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకులు.

Congress: కోమటిరెడ్డి బ్రదర్స్‌. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకులు. ముఖ్యంగా తెలంగాణ పాలిటిక్స్‌లో ఫైర్‌ బ్రాండ్‌ లీడర్లు. అలాంటి నాయకులు ఇప్పుడు తలోదారి అవ్వబోతున్నారన్న ప్రచారానికి ఇక తెరపడినట్టేనా? అన్న మాటే శాసనంగా, అన్న వేసిన దారిలో నడిచిన తమ్ముడి అవుటర్‌ వాయిస్‌‌‌ను బంద్‌ చేశారా? తిరుమల వెంకన్న సాక్షిగా తాను కమలం తీర్థం పుచ్చుకోబోతున్నాన్న రాజగోపాలుడు తన మాటను వెనక్కి తీసుకున్నట్టేనా? అన్న సరెండర్‌ అయినట్టే తమ్ముడు కూడా ఇక కుమ్మేస్తారా? ఇంతకీ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్‌ రోల్ ఏంటి?

కోమటిరెడ్డి బ్రదర్స్‌లో వెంకట్‌రెడ్డి కాస్త సాఫ్ట్‌గా కనిపించినా తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి దుకూడుగా ముందుకు వెళ్లే రకం. ఆ వ్యక్తిత్వమే ఆయనను రాజకీయాల్లో కీలకమై నాయకుడిగా ఎదిగేలా చేసింది. అలాంటి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌‌‌తో మళ్లీ కలసి మెలసి తిరుగుతున్నారట. అన్నయ్య వెంకట్‌రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగించాలన్న దానిపై ఒక క్లారిటీ మీదున్న రాజగోపాల్‌రెడ్డి, అన్నను సారథి చేయకుంటే పార్టీ మారుతామని అప్పట్లో బెదిరింపులకు దిగారు. ఇలా ముందే పార్టీ మారుతున్నట్లు ప్రకటించి, అధిష్టానానికి హెచ్చరికలు పంపించారు కూడా. తిరుమల వెంకన్న సాక్షిగా తెలంగాణలో కమలానిదే భవితవ్యం అంటూ ప్రకటించి, తాను కమలం తీర్థం పుచ్చుకుంటున్నట్టు పరోక్షంగా చెప్పారు.

అలాంటి కోమటిరెడ్డి బ్రదర్స్‌లో అన్న వెంకట్‌రెడ్డి కాస్త మెత్తబడ్డారు. సీనియర్‌ నాయకుడు వీహెచ్‌ ప్రతిపాదనతో దిగి వచ్చారు. మొన్నటి రేవంత్‌రెడ్డి కార్యక్రమంలో అన్నీ తానై వ్యవహరించారు వెంకట్‌రెడ్డి. ఆ సందర్భంలో తొలిసారి రేవంత్‌ నాయకత్వం మీద స్పందించారు. నాయకుడంటే ఎలా ఉండాలో, అధికార పార్టీ విధానాలపై ఎలా పోరాడాలో చెప్పుకొచ్చారు. ఇదే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా నడుస్తుండగా, రాజగోపాల్‌రెడ్డి రెస్పాన్స్‌పై, పార్టీలో ఆయన రోల్‌పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో అధికార పార్టీ తాత్సారం చేస్తుందంటూ రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన సీనియర్ల టీమ్‌లో చాలా రోజుల తర్వాత రాజగోపాల్‌రెడ్డి ప్రముఖంగా కనిపించారు. తన వాయిస్‌ వినిపించారు.

నిన్న మొన్నటి దాకా, ఇన్నాళ్లూ నమ్ముకున్న పార్టీలో ఎలివేషన్ లేదంటూ పార్టీ పగ్గాలు దక్కుతాయన్న ఆశా కనిపించడం లేదంటూ, అందివచ్చే అవకాశాల్లో సీనియర్ల సహకారం లేదంటూ ఒంటికాలు మీద లేచిన రాజగోపాల్‌‌రెడ్డి ప్రత్యర్ధుల నుంచి అనూహ్యంగా వస్తున్న బంపర్ ఆఫర్లు సయోధ్య విషయాల్లో డైలామాలో పడ్డారు. ఒకవైపు నుంచి పెరుగుతున్న ఒత్తిడి, మరోవైపు కాంగ్రెస్‌లో సరైన గుర్తింపు లేదన్న భావన, రాజగోపాల్‌రెడ్డిని మరోలా ఆలోచించేలా చేసిందన్న టాక్‌ నడిచింది అప్పట్లో. ఇన్నాళ్లూ నమ్ముకొని ఉంటున్న హస్తం పార్టీపై పై చేయి సాధించాలన్న ఆలోచనతో తిరుమల వెంకన్న సాక్షిగా తాను కమలం పార్టీలో చేరబోతున్నట్టు పరోక్షంగా ఓ కామెంట్‌ చేసి సంచలనం సృష్టించారు.

2014, 2018లో పార్టీ ఓటమి తర్వాత కాంగ్రెస్‌ పార్టీపై ఇద్దరు అన్నదమ్ములు ఓ రేంజ్‌లో విమర్శలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అయితే, కాంగ్రెస్ నేతలను తీవ్రంగా తిట్టిపోశారు. రాహుల్‌గాంధీతో పాటు అప్పటి ఇంచార్జ్ కుంతియా, నాటి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అదే నోటితో మోడీతో పాటు బీజేపీ మీద ప్రశంసలు కురిపించారు. అప్పట్లో బీజేపీలో చేరడానికే రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారన్న చర్చ కూడా జోరు మీద నడిచింది. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి, కమలంతో దోస్తీకి సై అంటున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. వాస్తవానికి బీజేపీలో చేరుతానని రాజగోపాల్‌రెడ్డి చెప్పింది ఇది ఫస్టేమీ కాదు. గతంలో చాలాసార్లు, చాన్నాళ్ల కిందటే కమలం పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. కానీ తర్వాత మనసు మార్చుకున్నారు. దుబ్బాక, గ్రేటర్, సాగర్‌, హుజూరాబాద్‌ ఇలా ఏ ఎన్నికల్లో ఎక్కడా కనిపించలేదు. అలాంటిది సడన్‌‌గా రూట్‌ మార్చడంపై గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి, అన్నయ్య సరెండర్‌ అయినట్టే తమ్మడు కూడా ఇక కుమ్ముడే అంటారా లేదా సైలెంట్‌గా తన రోల్‌ను యాక్టివేట్‌ చేస్తారా. అనేది చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories