TS Cabinet: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అమీర్ అలీఖాన్

TS Cabinet: హైకోర్టు ఆదేశాలతో మరోసారి కేబినెట్ తీర్మానం

Shashank Gullapelli
Published on: 12 March 2024 4:21 PM IST
Kodandaram And Amir Ali Khan Are The MLC Candidates For Governor Kota
X

TS Cabinet: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అమీర్ అలీఖాన్

TS Cabinet: సీఎం రేవంత్ అధ్యక్షతన జరుగుతున్న తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మరోసారి కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను ఖరారు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. అంతకుముందు వీళ్లిద్దరి పేర్లనే గవర్నర్‌కు ప్రభుత్వం సిఫార్సు చేయగా..బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హై కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన ధర్మాసనం గవర్నర్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించే అధికారం లేదని.. కేబినెట్ కు తిరిగిపంపాలని ఆదేశించింది.. హైకోర్టు ఆదేశాలతో గవర్నర్ పున‌‌:పరిశీలన కోసం తిరిగి ప్రభుత్వానికి పంపారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను మరోసారి గవర్నర్‌కు సిఫార్సు చేయాలని నిర్ణయించింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story