Kodad Municipal Election Results 2026: కోదాడలో ‘హస్తం’ సునామీ: మున్సిపాలిటీ క్లీన్ స్వీప్.. 27 వార్డుల్లో కాంగ్రెస్ జయకేతనం!

Kodad Municipal Election Results 2026: సూర్యాపేట జిల్లాలోని కీలకమైన కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.

Arun Chilukuri
Published on: 13 Feb 2026 12:42 PM IST
Kodad Municipal Election Results 2026: కోదాడలో ‘హస్తం’ సునామీ: మున్సిపాలిటీ క్లీన్ స్వీప్.. 27 వార్డుల్లో కాంగ్రెస్ జయకేతనం!
X

Kodad Municipal Election Results 2026: సూర్యాపేట జిల్లాలోని కీలకమైన కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. జిల్లావ్యాప్తంగా అధికార పార్టీ హవా కొనసాగుతుండగా, కోదాడ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారు. ఏకపక్షంగా సాగిన ఈ ఫలితాల్లో విపక్షాలు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయాయి.

ఏకపక్షంగా గెలుపు లెక్కలు:

మున్సిపాలిటీలోని మొత్తం 35 వార్డులకు జరిగిన ఎన్నికల తుది ఫలితాలు ఇలా ఉన్నాయి:

కాంగ్రెస్: 27 వార్డులు

బీఆర్‌ఎస్‌: 03 వార్డులు

స్వతంత్రులు (Independents): 05 వార్డులు

కోదాడ గడ్డపై కాంగ్రెస్ తన రాజకీయ పట్టును మరోసారి నిరూపించుకుంది. 35 స్థానాల్లో ఏకంగా 27 చోట్ల జయకేతనం ఎగురవేసి, మున్సిపల్ పీఠాన్ని భారీ మెజారిటీతో దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ కేవలం 3 వార్డులకే పరిమితమై భారీ పరాజయాన్ని చవిచూడగా, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. ఈ చారిత్రాత్మక విజయం నేపథ్యంలో కోదాడ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తూ, రంగులు చల్లుకుంటూ పండగ చేసుకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story