Keshava Rao: కాంగ్రెస్‌లో చేరికపై కేకే క్లారిటీ

Keshava Rao: తిరిగి కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నా

Shashank Gullapelli
Published on: 28 March 2024 9:14 PM IST
KK Clarity On Joining Congress
X

Keshava Rao: కాంగ్రెస్‌లో చేరికపై కేకే క్లారిటీ

Keshava Rao: కాంగ్రెస్‌లో చేరిక బీఆర్ఎస్‌ నేత కే.కేశవరావు క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నట్లు చెప్పారు. కేసీఆర్‌తో పార్టీకి సంబంధించిన అంశాలపై చర్చించానని తెలిపారు. పార్టీ అంతర్గత అంశాలపై చర్చించినట్లు చెప్పారు. కవిత అరెస్ట్‌పై కూడా చర్చించామన్నారు. తనకు కేసీఆర్‌ చాలా గౌరవం ఇచ్చారని... బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు సహకరించారని తెలిపారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో ఉన్న తాను.. తిరిగి సొంత పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్‌లోనే కొనసాగాలన్న విప్లవ్ నిర్ణయం మంచిందన్నారు కేకే. ఈనెల 30న తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ వెల్లడించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story