ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు

Kishan Reddy: 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Arun Chilukuri
Updated on: 31 July 2022 7:00 PM IST
Kishan Wants National Flag at Every House on August 15
X

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు

Kishan Reddy: 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా త్యాగధనుల గురించి తెలుసుకునేలా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ఆగస్ట్ 2న పింగళి వెంకయ్య శత జయంతి వేడుకలను ఢిల్లీలో నిర్వహిస్తామన్నారు. ఆగస్ట్ 13 నుంచి 15వరకు దేశంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని కిషన్ రెడ్డి కోరారు.

హర్ ఘర్ తిరంగా.. ఘర్ ఘర్ తిరంగా పేరుతో కార్యక్రమాలు రూపొందించామని చెప్పారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఇళ్లపై జెండా ఎగురవేయాలని ఆయన కోరారు. అయితే ప్రతి ఒక్కరు స్వయంగా జెండా కొనుక్కుని ఎగురవేయాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆగస్ట్ 14న రాత్రి అందరూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలన్నారు. ఆగస్ట్ 15న మహనీయుల విగ్రహాల వద్ద నివాళులర్పించాలని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story