సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ

సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ
x

కిషన్ రెడ్డి ఫైల్ ఫోటో 

Highlights

*హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లను తిరిగి నడపాలి-కిషన్‌రెడ్డి *ఎంఎంటీఎస్ రైళ్లు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు *రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే రైల్వే స్పందిస్తుంది-కిషన్‌రెడ్డి

కరోనా కట్టడిలో భాగంగా హైదరాబాద్ సిటీలో నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లను తిరిగి ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఎంఎంటీఎస్ సౌకర్యం నిలిచిపోవడంతో విద్యార్ధులు, ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నగర శివారు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సాధారణ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లను వెంటనే నడుపాలని కోరారు. మహారాష్ట్ర, ముంబైలోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు రైల్వేశాఖ స్పందించి లోకల్ రైళ్లను నడుపుతుందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories