Kishan Reddy Visits Covid Hospitals: కోవిడ్ ఆసుపత్రుల్లో కిషన్ రెడ్డి పర్యటన

Kishan Reddy Visits Covid Hospitals: కోవిడ్ ఆసుపత్రుల్లో కిషన్ రెడ్డి పర్యటన
x
Kishan Reddy Visits Covid Hospitals in Hyderabad
Highlights

Kishan Reddy Visits Covid Hospitals: ఈరోజు బీజీపీ నేత కిషన్ రెడ్డి హైదరాబాద్ లో కోవిడ్ ఆసుపత్రులలో పర్యటించారు.

Kishan Reddy Visits Covid Hospitals: ఈరోజు బీజీపీ నేత కిషన్ రెడ్డి హైదరాబాద్ లో కోవిడ్ ఆసుపత్రులలో పర్యటించారు. అనంతరం ఆయన గాంధీ ఆసుపత్రి వద్ద విలేకరులతో మాట్లాడారు. ఆయన ఏమ్మన్నారో ఆయన మాటల్లోనే...

రెండవ దశలో మరిన్ని హాస్పిటల్ లు సందర్శించాను గచ్చిబౌలి టీమ్స్, ఎర్రగడ్డ ఆయుర్వేదిక్, గాంధీ హాస్పిటల్ లో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నా.

♦ కోవిడ్ బెడ్స్ మరిన్ని పెంచాల్సిన అవసరం ఉంది..

♦ ఇవాళ తెలంగాణ లో అత్యధికం గా కేసులు నమోదయ్యాయి.

♦ ఆగస్టు లో భారీగా కేసులు వచ్చే అవకాశం ఉంది మరిన్ని సౌకర్యాలు కల్పించాలి.

♦ గ్రామాల సర్పంచ్ ల నుండి ప్రజలందరినీ చైతన్యం చేయాల్సిన అవసర ఉంది.

♦ కోవిడ్ వారియర్స్, సిబ్బంది జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది.

♦ వెంటిలేటర్ లు పెంచాలి.

♦ ఔట్ సోర్సింగ్ డాక్టర్స్ ,సిబ్బంది ని మరింత పెంచాలి.

♦ ఈరోజు కరోన భారిన పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకొని అప్పులపాలై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

♦ అందుకోసం ప్రభుత్వ హాస్పిటల్ లలో సరైన వసతులు ఉన్నాయని ప్రభుత్వానికి ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.

♦ ఢిల్లీ, పూణే, ముంబై లాంటి నగరాలతో పోల్చితే టెస్టుల సంఖ్యలు మరిన్ని పెంచాలి.

♦ పాజిటివ్ వచ్చిన వారు తప్పుడు అడ్రెస్ ఇవ్వడం, బయట తిరగడం లాంటివి చేస్తున్నారు ఇది అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత.

♦ 10 లక్షల N95 మస్కులు 2లక్షల 30 వేల ppe కిట్స్ తెలంగాణ కి కేంద్ర ప్రభుత్వం అందించింది.

♦ ఇక్కడ బెడ్ల సంఖ్యలు పెంచాల్సిన అవసర ఉంది.

♦ ఢిల్లీ లో రికవరీ రేటు 85 శాతం ఉంది తెలంగాణ లో రికవరీ రేటు పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

♦ తెలంగాణ ప్రభుత్వం తో సమన్వయం గా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది.

♦ కేసులు, టెస్టులు మరణాల విషయం లో దాపరికాలు అవసర లేదు.

♦ మరణాల సంఖ్యను తగ్గించే విషయంలో ప్రభుత్వం అలాంటి తప్పులు చేయద్దు అని విజ్ఞప్తి.

♦ రాష్ట్ర ప్రభుత్వ లోపాలు ఏమైనా ఉంటే సరిద్దిద్దుకోవాలి.

♦ ఆస్తమా, డయాలసిస్ గుండె సంబంధ రోగులు దయచేసి ఇంట్లో నుండి ఎవరూ బయటకు రాకూడదు.

♦ కరోన మహమ్మారి కి ఇంతవరకు వాక్సిన్ రాలేదు.

♦ పాజిటివ్ వచ్చిన వారు బయటకు తిరగడం సరికాదు.

♦ పాజిటివ్ నుండి కోలుకుని వచ్చిన వారు ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు రావాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories