Kishan Reddy: తెలంగాణలోని పట్టణాల పునరుజ్జీవనానికి కేంద్రం కృషి

Kishan Reddy: స్మార్ట్ సిటీలకై వరంగల్, కరీంనగర్‌కు 329కోట్లు విడుదల చేశాం

Jyothi
Published on: 8 Jan 2023 7:45 PM IST
Kishan Reddy Slams Telangana Government about Utilisation of Central Funds
X

Kishan Reddy: తెలంగాణలోని పట్టణాల పునరుజ్జీవనానికి కేంద్రం కృషి

Kishan Reddy: తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాల పునరుజ్జీవనానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే స్మార్ట్ సిటీస్ మిషన్ క్రింద వరంగల్, కరీంనగర్ పట్టణాలకు ఇప్పటికే 392 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఇక అమృత్ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన 12 పట్టణాలకు 833కోట్ల 36లక్షల రూపాయలు విడుదల చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. అమృత్ 2.0 లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 143 పట్టణాలలో 2వేల 780 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన – అర్బన్ పథకం క్రింద తెలంగాణ రాష్ట్రానికి 2లక్షల 49వేల 465 ఇళ్లు మంజూరు చేయగా.. వీటి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే 3వేల128కోట్ల 14 లక్షల రూపాయలను విడుదల చేశామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ కిషన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.

Jyothi

Jyothi

Next Story