Kishan Reddy: తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీ రోల్ మోడలా..?

Kishan Reddy: సీఎం కేసీఆర్ బీహార్ టూర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో పైర్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 1 Sept 2022 5:31 PM IST
Kishan Reddy Slams CM KCR Bihar Tour
X

Kishan Reddy: తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీ రోల్ మోడలా..?

Kishan Reddy: సీఎం కేసీఆర్ బీహార్ టూర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో పైర్ అయ్యారు. గుజరాత్ మోడల్ కాదన్న కేసీఆర్ తెలంగాణలో కేసీఆర్ కుటుంబం రోల్ మోడలా అని ప్రశ్నించారు. 15 శాఖలు, 4 మంత్రి పదవులు తన కుటుంబాని ఇచ్చుకున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకొచ్చి ఏం సదేశం ఇవ్వాలని చూస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో లాభపడింది కేవలం కేసీఆర్ కుటుంబమేనన్న కిషన్ రెడ్డి ఇప్పటికైనా కేసీఆర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేందన్నారు.

మజ్లిస్ తో జతకట్టి మతకల్లోలాలు రెచ్చగొడుతున్న కేసీఆర్ కు బీజేపీని విమర్శించేస్థాయి లేదన్నారు. దేశ రాష్ట్ర ప్రజల సమస్యలు చెప్పుకుందామంటే అందుబాటులో ఉండని ముఖ్యమంత్రి దేశ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడే బీహార్ కు దోచిపెడుతున్నారన్న కేసీఆర్ ఇప్పుడు ఏముఖం పెట్టుకుని ఆరాష్ట్రానికి వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story