Kishan Reddy: సింగరేణిపై సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుంది

Kishan Reddy: సింగరేణిపై సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుంది
x
Highlights

Kishan Reddy: దేశ బొగ్గు ఉత్పత్తిలో వెన్నెముకగా ఉన్న సింగరేణి కాలరీస్ సంస్థ (SCCL) రాజకీయ ప్రయోగశాలగా మారిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Kishan Reddy: దేశ బొగ్గు ఉత్పత్తిలో వెన్నెముకగా ఉన్న సింగరేణి కాలరీస్ సంస్థ (SCCL) రాజకీయ ప్రయోగశాలగా మారిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ రాజకీయ స్వార్థం కోసం సింగరేణిని అన్ని రకాలుగా విధ్వంసం చేశాయని తీవ్రంగా మండిపడ్డారు.

నైనీ కోల్ బ్లాక్‌లో భారీ అక్రమాలు: ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ కేటాయింపుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుసరిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.

ప్రైవేటుకు కట్టబెట్టారు: సింగరేణి సొంతంగా మైనింగ్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, లాభదాయకమైన కోల్ బ్లాక్‌లను ప్రైవేటు సంస్థలకు ఎందుకు కట్టబెట్టారని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి జోక్యం: గతంలో నైనీ కోల్ బ్లాక్ టెండర్ల ప్రక్రియలో అప్పటి ముఖ్యమంత్రి నేరుగా జోక్యం చేసుకుని వాటిని రద్దు చేయడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని ధ్వజమెత్తారు.

సీబీఐ దర్యాప్తునకు సవాల్: సింగరేణి మరియు నైనీ కోల్ బ్లాక్ అక్రమాలపై బహిరంగ చర్చ జరగాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. "రాష్ట్ర ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఈ వ్యవహారంపై సీబీఐ (CBI) దర్యాప్తునకు సిఫార్సు చేయాలి. రాష్ట్రం ముందుకు వస్తే కేంద్రం ఖచ్చితంగా పరిశీలిస్తుంది" అని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి వల్లే సింగరేణికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories