Kishan Reddy: దేశ ప్రజలు తలెత్తుకు తిరిగే విధంగా కేంద్రం ఉంది

దేశ ప్రజలు తలెత్తుకు తిరిగే విధంగా కేంద్రం ముందుకు వెళ్తుందన్నారు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Sandeep Eggoju
Updated on: 13 Dec 2021 6:45 AM IST
Kishan reddy said the vaccine produced by Indian companies was highly efficient
X

దేశ ప్రజలు తలెత్తుకు తిరిగే విధంగా కేంద్రం ముందుకు వెళ్తుందన్నారు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు(ఫైల్-ఫోటో)

Kishan Reddy: దేశ ప్రజలు తలెత్తుకు తిరిగే విధంగా కేంద్రం ముందుకు వెళ్తుందన్నారు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. టీడీఎఫ్‌- యూఎస్ఏ 6వ ప్రవాసీ తెలంగాణ దివస్‌ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కిషన్ రెడ్డి కొవిడ్‌ టీకా తయారీలోనూ దేశం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందన్నారు. కరోనా టీకాను ఏడెనిమిది సంస్థలే తయారు చేస్తున్నాయని, దేశంలో తయారైన టీకా అద్భుతంగా పనిచేస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు మరింత కృషి చేయాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్‌ పోరంఅంటే తెలంగాణ ఉద్యమమే గుర్తుకు వస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీడీఎఫ్‌ కీలకపాత్ర పోషించిందన్నారు. అమరవీరుల లక్ష్య సాధనకోసం కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story