యువత, విద్యార్థులు, మహిళల మద్దతు బీజేపీకే : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Arun Chilukuri
Updated on: 25 Nov 2020 4:54 PM IST
యువత, విద్యార్థులు, మహిళల మద్దతు బీజేపీకే : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
X

యువత, విద్యార్థులు, మహిళలు పూర్తిగా బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీలో మెరుగైన పాలన అందించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ఎలక్షన్‌ కోడ్‌ వచ్చిన తర్వాత కూడా ఎక్కడబడితే అక్కడ టాయిలెట్లు ఏర్పాటు చేసి తండ్రికొడుకుల బొమ్మలు తగిలించుకున్నారని కేంద్రమంత్రి మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని టీఆర్ఎస్‌ ఇప్పుడు కొత్త మేనిఫెస్టోను విడుదల చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దెవా చేశారు. గ్రేటర్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే.. గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని కిషన్‌ రెడ్డి ప్రకటించారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, ఫుట్‌పాత్‌ల నిర్మాణం ప్రత్యేక దృష్టిసారిస్తామని కిషన్‌రెడ్డి చెప్పుకచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story