Kishan Reddy: ఒక వ్యక్తికి ఒకే పదవి ఉంటుందని కిషన్ రెడ్డి క్లారిటీ

Kishan Reddy: క వ్యక్తికి ఒకే పదవి ఉంటుందని కిషన్ రెడ్డి క్లారిటీ

Jyothi
Updated on: 5 July 2023 4:00 PM IST
Kishan Reddy Responded in Delhi Media Chit chat
X

Kishan Reddy: టీబీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన కిషన్ రెడ్డి.. ప్రధాని మోడీ వరంగల్ పర్యటన తర్వాత బాధ్యతలు

Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. బీజేపీ హైకమాండ్ నిర్ణయాలను ఎవరైనా పాటించాల్సిందేనన్నారు. ఒక వ్యక్తికి ఒకే పదవి ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో ఆయన మీడియా చిట్‌చాట్‌లో తన అభిప్రాయం వెల్లడించారు. ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ భేటీకి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. అయితే తెలంగాణ బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్‌తో ఆయన సమావేశమై.. తాజా పరిస్థితులపై చర్చించారు.

ప్రస్తుతం తాను ప్రధాని మోడీ వరంగల్ పర్యటనపై ఫోకస్ పెట్టినట్టు చెప్పుకొచ్చారు. ఈ నెల 8న ప్రధాని మోడీ వరంగల్ వస్తున్నారు. మోడీ పర్యటన తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటానని కిషన్ రెడ్డి తెలిపారు. మోడీ పర్యటనను విజయవంతం చేసే దిశగా ఆయన ముమ్మర ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఈ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ బయలుదేరనున్నారు. రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లో పార్టీ ఆఫీస్ బేరర్లతో సమావేశమవుతారు.

Jyothi

Jyothi

Next Story