GWMC Elections: డబ్బు, మధ్యంతో టీఆర్ఎస్ గెలువాలని చూస్తుంది- కిషన్ రెడ్డి

GWMC Elections: ఏడేళ్లుగా వరంగల్ నగర అభివృద్ధికి ఏం చేశారని టీఆర్ఎస్ కు ఓటు వేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

Arun Chilukuri
Published on: 26 April 2021 4:38 PM IST
Kishan Reddy Release BJPs Manifesto for the Greater Warangal Municipal
X

GWMC Elections: డబ్బు, మధ్యంతో టీఆర్ఎస్ గెలువాలని చూస్తుంది-కిషన్ రెడ్డి

GWMC Elections: ఏడేళ్లుగా వరంగల్ నగర అభివృద్ధికి ఏం చేశారని టీఆర్ఎస్ కు ఓటు వేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కిషన్ రెడ్డి టీఆర్ఎస్ పాలనపై విరుచుకుపడ్డారు. అంతకు ముందు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ సైతం వరంగల్ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. డబ్బు, మద్యంతో టీఆర్ఎస్ గెలువాలని చూస్తుందని కాంగ్రెస్ కు ఓటేస్తే మురిగిపోయినట్లే అన్నారు. ప్రధాన పోటీ టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. బీజేపీకి మేయర్ పీఠం అప్పగించినట్లయితే వరంగల్ సమగ్రాభివృద్ధికి కృషిచేసిన వారవుతారని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story