Kishan Reddy: ధాన్యం సేకరణపై పీయూష్ గోయల్‌కు కిషన్ రెడ్డి లేఖ

Kishan Reddy letter to Piyush Goyal on Grain Procurement
x

Kishan Reddy: ధాన్యం సేకరణపై పీయూష్ గోయల్‌కు కిషన్ రెడ్డి లేఖ

Highlights

Kishan Reddy: తెలంగాణ నుండి ఈ రబీ సీజన్‌లో..15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించండి

Kishan Reddy: కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌‌కు... కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. ఈ రబీ సీజన్ లో తెలంగాణ నుండి 15 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని సేకరించాలని కోరారు కిషన్ రెడ్డి. రైతు సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందన్న ఆయన.. ఇకపైనా ఈ సహాయాన్ని కొనసాగించాలన్నారు.. 2015-16 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో 5.35 లక్షల మంది రైతులు ధాన్య సేకరణ ద్వారా లబ్ధి పొందగా.. గత సీజన్లో 20 లక్షలమంది తెలంగాణ రైతులు లబ్ధిపొందారని లేఖలో గుర్తుచేశారు. తెలంగాణ రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. రబీ మార్కెటింగ్ సీజన్లో రాష్ట్రం నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్ సేకరణకు ఉపక్రమించాలని పీయూష్ గోయల్‌ను కోరారు కిషన్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories