టీబీజేపీలో మార్పులకు కిషన్‌రెడ్డి శ్రీకారం.. త్వరలో బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పు
Kishan Reddy: తన టీమ్‌ను రాష్ట్ర కార్యవర్గంలోకి చేర్చుకోవాలన్న యోచనలో కిషన్‌రెడ్డి
టీబీజేపీలో మార్పులకు కిషన్‌రెడ్డి శ్రీకారం.. త్వరలో బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పు
Kishan Reddy: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీబీజేపీలో మార్పులకు కిషన్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. త్వరలో బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పు ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 5 నుంచి 7 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించడానికి కిషన్‌రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యాక్టివ్‌గా లేని జిల్లా అధ్యక్షులను మార్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. టీబీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి.. తన టీమ్‌ను రాష్ట్ర కార్యవర్గంలోకి చేర్చుకోవాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. అధ్యక్షుల మార్పుపై రేపు లేదా ఎల్లుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Next Story




