సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరో సారి ఫైర్

Kishan Reddy: సీఎం కేసీఆర్ అహంకారానికి ప్రజలు బలైపోతున్నారు

Jyothi
Published on: 3 Aug 2022 6:57 AM IST
Kishan Reddy Fire On CM KCR
X

సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరో సారి ఫైర్ 

Kishan Reddy: టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై మరోసారి ఫైరయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం కేసీఆర్ అహంకారానికి రాష్ట్ర ప్రజలు బలైపోతున్నారని . అరాచకాలకు, అసత్య ప్రచారాలకు టీఆర్ఎస్ సర్కార్ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందన్నారు. కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పడం కాదు రాష్ట్రంలో సీటు ఖాళీ అయ్యేట్టు ఉంది జాగ్రత్త అంటూ ఎద్దేవా చేశారు. కొడుకును సీఎం చేయాలనే ఆలోచన తప్పా అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రైతుల సంక్షేమాన్ని పక్కనపెట్టి పంజాబ్ రైతుల సంక్షేమం ఎవరికి కావాలి అన్నారు. రాష్ట్రాన్నే ఉద్ధరించలేని కేసీఆర్ దేశాన్ని ఎలా ఉద్దరిస్తాడని విమర్శలు చేశారు.

Jyothi

Jyothi

Next Story