Kishan Reddy: రథయాత్రల ద్వారా అన్నివర్గాల ప్రజలకు దగ్గరవుతాం

Kishan Reddy: మూడోసారి మోడీ నాయకత్వంలో అధికారంలోకి వస్తాం

Shekhar G
Published on: 19 Feb 2024 1:59 PM IST
Kishan Reddy Did Special Pooja For Campaign Chariots
X

Kishan Reddy: రథయాత్రల ద్వారా అన్నివర్గాల ప్రజలకు దగ్గరవుతాం

Kishan Reddy: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కమలం పార్టీ సిద్ధమవుతోంది. రేపటి నుంచి మార్చి ఒకటి వరకూ తెలంగాణ బీజేపీ రథయాత్రలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ చేపట్టనున్న రథయాత్రలకు విజయ సంకల్ప యాత్రగా నామకరణం చేసింది.

చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు నిర్వహించి విజయ సంకల్పయాత్ర ప్రచార రథాలను కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కిషన్ రెడ్డి స్వయంగా ప్రచార వాహనాన్ని నడిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు కృష్ణాయాదవ్, ఈటల రాజేందర్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఐదు క్లస్టర్లలో ఒకేసారి బస్సు యాత్రలను బీజేపీ ప్రారంభించనుంది. అస్సోం సీఎం, గోవా సీఎం, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తదితరులుఈ యాత్రలలో పాల్గొననున్నారు.

Shekhar G

Shekhar G

Next Story