రాహుల్ విమర్శలపై కిషన్ రెడ్డి కౌంటర్

Kishan Reddy: స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాజెక్ట్ 8 ఏళ్ల క్రిందట మొదలైంది. అప్పట్లో కేంద్రం, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.

Sriveni Erugu
Published on: 10 Feb 2022 8:14 AM IST
Kishan Reddy Counters on Rahul Criticism
X

రాహుల్ విమర్శలపై కిషన్ రెడ్డి కౌంటర్ 

Kishan Reddy: ముచ్చింతల్ లో కొలువుదీరిన శ్రీరామునుజా చార్యుల సమతామూర్తి విగ్రహంపై రాహుల్ గాంధీ విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. చైనాలో తయారు చేసిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారని విమర్శిస్తూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ను కిషన్ రెడ్డి తప్పుబట్టారు. ట్విట్టర్‌లో 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ'కి సంబంధించి నాలుగు అంశాలతో కూడిన వివరణ ఇచ్చారు. 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' అనే ప్రాజెక్ట్ 8 ఏళ్ల క్రిందట ప్రైవేటు ఆధ్యాత్మిక ప్రాజెక్ట్‌గా మొదలైందని.. అప్పట్లో కేంద్రం, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story