Kishan Reddy: బడ్జెట్‌లో అంకెల గారడీ..మాటల గారడీ మాత్రమే ఉంది

Kishan Reddy: వ్యవసాయానికి రూ.19,746 కోట్ల బడ్జెట్‌ ఎలా సరిపోతుంది

Shekhar G
Published on: 10 Feb 2024 6:03 PM IST
Kishan Reddy Comments On Telangana Budget
X

Kishan Reddy: బడ్జెట్‌లో అంకెల గారడీ..మాటల గారడీ మాత్రమే ఉంది

Kishan Reddy: తెలంగాణ బడ్జెట్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంకెల గారడీ..మాటల గారడీ మాత్రమే ఉందని కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల కోసం బడ్జెట్‌లో చెప్పిందేమీ లేదన్నారు. వ్యవసాయానికి 19 వేల 746 కోట్ల బడ్జెట్‌ ఎలా సరిపోతుందన్నారు. ఆరు గ్యారెంటీల్లో రైతులకు ఇచ్చిన గ్యారెంటీ అమలు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

Shekhar G

Shekhar G

Next Story