Kishan Reddy: ప్రధాని వస్తే కలిసే సమయం లేదు కానీ..మహారాష్ట్రలో బీఆర్ఎస్ మీటింగ్ పెడతారట

Kishan Reddy Comments On KCR
x

Kishan Reddy: ప్రధాని వస్తే కలిసే సమయం లేదు కానీ..మహారాష్ట్రలో బీఆర్ఎస్ మీటింగ్ పెడతారట

Highlights

Kishan Reddy: మళ్లీ అధికారంలోకి రావాలనే ఆలోచన తప్ప.. అభివృద్ధి గురించి ఆలోచన లేదు

Kishan Reddy: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియాలన్న కిషన్ రెడ్డి.. ముఖ్యమంత్రికి రాష్ట్రాభివృద్ధి జరగాలనే ఆకాంక్ష లేదన్నారు. సీఎంకు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రమే తెలుసన్నారు. కేంద్రం అందించే సహకారాన్ని అందిపుచ్చుకునే ఆలోచన సీఎం కేసీఆర్‌కు లేదని తెలిపారు. మళ్లీ అధికారంలోకి రావాలనే ఆలోచన తప్ప అభివృద్ధి గురించి ఆలోచన లేదని లేఖలో పేర్కొన్నారు కిషన్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories