Kishan Reddy: ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ పై కేసు నమోదు చేయాలి

Kishan Reddy: వ్యక్తి గత స్వేచ్ఛ, దేశ సమగ్రతకు విఘాతం

Jyothi
Published on: 5 April 2024 8:13 AM IST
Kishan Reddy Comments On KCR
X

Kishan Reddy: ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ పై కేసు నమోదు చేయాలి

Kishan Reddy: వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ఫోన్ ట్యాపింగ్ పై మాజీ సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధుల ఫోన్లు, కాంట్రాక్టర్ల ఫోన్లు, పారిశ్రామిక వేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేసి అక్రమదందాలకు పాల్పడ్డారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ ముసుగులో ఫాంహౌస్ ఫైల్స్ విషయాన్ని కేసీఆరే స్వయంగా బయటపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.

కేసీఆర్ అరాచకానికి ఇంతకన్నా సాక్ష్యం అవసరంలేదన్నారు. కేసీఆర్ పాల్పడిన దుర్మార్గపు చర్యలపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకుని కేసీఆర్ పై కేసునమోదు చేయాలన్నారు. ఈ విషయంపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.

Jyothi

Jyothi

Next Story