Kishan Reddy: గజ్వేల్ కేసీఆర్ సొంత జాగీరు కాదు

Kishan Reddy: ఎన్నికల షెడ్యూల్ రాకముందే దౌర్జన్యం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం

Shekhar G
Published on: 2 Sept 2023 7:50 PM IST
Kishan Reddy Comments On KCR
X

Kishan Reddy: గజ్వేల్ కేసీఆర్ సొంత జాగీరు కాదు

Kishan Reddy: ఎన్నికల షెడ్యూల్ రాకముందే కేసీఆర్ ప్రభుత్వం బీజేపీ నాయకులపై, కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. గజ్వేల్ మెరుస్తూ ఉందంటే వెళ్లి చూద్దామని బయలుదేరిన కామారెడ్డి జిల్లా తమ పార్టీ నాయకుడు వెంకరటరమణారెడ్డిని అరెస్టు చేయడం కేసీఆర్ ప్రభుత్వం బరితెగింపు తనానికి నిదర్శనమన్నారాయన... గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధిని చూస్తామంటే కేసీఆర్‌కు ఎందుకింత భయమని ఆ‍యన ప్రశ్నించారు. గజ్వేల్‌ను చూసే అధికారం దేశ ప్రజలందరికీ ఉందనీ, నీ సొంత జాగీరు కాదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, తమ పార్టీ ఆషామాషా పార్టీ కాదనే విషయాన్ని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలన్నారాయన..

Shekhar G

Shekhar G

Next Story