బండి సంజయ్‌ పాదయాత్రపై టీఆర్‌ఎస్‌ శ్రేణుల దాడిని ఖండించిన కిషన్‌రెడ్డి

Kishan Reddy: గవర్నర్‌ను కేసీఆర్‌ ప్రభుత్వం అడుగడుగునా అవమానిస్తోంది

Jyothi
Published on: 16 Aug 2022 12:36 PM IST
Kishan Reddy Comments On CM KCR
X

బండి సంజయ్‌ పాదయాత్రపై టీఆర్‌ఎస్‌ శ్రేణుల దాడిని ఖండించిన కిషన్‌రెడ్డి

Kishan Reddy: బండి సంజయ్‌ పాదయాత్రపై టీఆర్‌ఎస్‌ శ్రేణుల దాడిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను పాతరేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్‌ తప్పులమీద తప్పులు చేస్తున్నారన్నారు. బీజేపీలో చేరాలనుకునే వారిపై కేసీఆర్‌ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని.. నిరాశ, నిస్పృహతో కేసీఆర్‌ ప్రభుత్వం భౌతిక దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటిమెంట్‌ పేరుతో సీఎం కుర్చీలో కేసీఆర్‌ ఎక్కువకాలం ఉండలేరని మండిపడ్డారు. ఇక గవర్నర్‌ ఎట్‌ హోంకు గైర్హాజరై సాంప్రదాయాన్ని కేసీఆర్‌ మంటగల్పుతున్నారని విమర్శించారు.

Jyothi

Jyothi

Next Story