Kishan Reddy: తెలంగాణలో బీఆర్ఎస్‌కి భవిష్యత్తు లేదు

Kishan Reddy: ఎంపీలు గెలిచినా బీఆర్ఎస్ చేసేదేమి లేదు

Jyothi
Published on: 26 Feb 2024 3:22 PM IST
Kishan Reddy Comments On BRS Party
X

Kishan Reddy: తెలంగాణలో బీఆర్ఎస్‌కి భవిష్యత్తు లేదు 

Kishan Reddy: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలవకున్న రాష్ట్రానికి కలిగి నష్టం ఏమి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్శించారు. సనత్‌నగర్‌లో నిర్వహించిన విజయసంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను అన్ని విధాలుగా దోచుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే రాహుల్‌ను ప్రధానిగా ఊహించుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రధానిగా మూడోసారి సైతం మోడీయే కావాలని దేశప్రజలు ఆకాంక్షిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.

Jyothi

Jyothi

Next Story