Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పునకు అవకాశమే లేదు

Kishan Reddy: మా జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవడం సహజం

Dhatripriya
Published on: 21 May 2023 3:31 PM IST
Kishan Reddy Comments On BJP President
X

Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పునకు అవకాశమే లేదు

Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పునకు అవకాశమే లేదని క్లారిటీ ఇచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అధ్యక్షుడి మార్పుపై వస్తున్న వార్తలు అర్దరహితమని ఆయన కొట్టిపారేశారు. మీడియాతో చిట్ చాట్ చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి... తామంతా ఒక కుటుంబమని... జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవటం సహజమన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తమ చేతుల్లో లేదని... సీబీఐ పరిధిలోని అంశమని కిషన్‌రెడ్డి తెలిపారు. ఆధారాలున్నాయి కాబట్టే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని సీబీఐ అరెస్ట్ చేసిందని తెలిపారు. కర్ణాటకలో అవినీతికి పాల్పడిన బీజేపీ ఎమ్మెల్యేను సైతం జైలుకు పంపించామన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఒక వార్డు మెంబర్ గెలిచినందుకే, సంబరపడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు తెలంగాణలో భవిష్యత్తు లేదని... బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Dhatripriya

Dhatripriya

Next Story