Telangana: ఈటల ఎపిసోడ్‌పై కిషన్‌రెడ్డి క్లారిటీ

Telangana: కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌ చేశారు.

Arun Chilukuri
Published on: 25 May 2021 3:51 PM IST
Telangana: ఈటల ఎపిసోడ్‌పై కిషన్‌రెడ్డి క్లారిటీ
X

Telangana: ఈటల ఎపిసోడ్‌పై కిషన్‌రెడ్డి క్లారిటీ

Telangana: కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ఈటల ఎపిసోడ్‌పై కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈటలను తాను కలవలేదని, ఫోన్‌లో మాత్రమే మాట్లాడానని కిషన్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో ఈటలతో చర్చలు జరుపుతానని వెల్లడించారు. అయితే, ఈటల నన్ను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమే అన్నారు. అందరినీ కలిసినట్లే నన్నూ కలుస్తానని ఈటల చెప్పారన్నారు.

ఈటలతో కలిసి 15ఏళ్లు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నానన్న కిషన్‌రెడ్డి ఈటలను ఎప్పుడు కలవాలనేది నిర్ణయించుకోలేదన్నారు. ఇక, హుజురాబాద్‌‌కు ఉపఎన్నిక వస్తే ఏం చేయాలో పార్టీలో ఇంకా చర్చించలేదని తెలిపారు. తాను, కేసీఆర్‌కు అనుకూలమని ప్రచారంచేసే వాళ్లను దేవుడే చూసుకుంటాడన్న కిషన్‌రెడ్డి తెలంగాణ బీజేపీలో గ్రూపులు ఉన్నాయనే సంగతి రేవంత్‌రెడ్డికి ఎలా తెలుసంటూ ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story