Top
logo

హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో కిడ్నాప్‌ కలకలం

హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో కిడ్నాప్‌ కలకలం
X
Highlights

* మాజీ హాకీ ప్లేయర్ ప్రవీణ్‌రావు అతని సోదరులు సునీల్‌రావు, నవీన్‌రావు కిడ్నాప్ * కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు * కిడ్నాపర్ల నుండి ముగ్గురిని క్షేమంగా కాపాడిన పోలీసులు

హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో కిడ్నాప్‌ కలకలం రేపింది. మాజీ హాకీ ప్లేయర్ ప్రవీణ్‌రావు అతని సోదరులు సునీల్‌రావు, నవీన్‌రావులను కొందరు దుండగులు కిడ్నాప్‌ చేశారు. రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఐటీ అధికారుల మంటూ మూడు వాహనాల్లో వచ్చిన దుండగులు లోపలకు వెళ్లారు. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ రాం పేర్లతో బెదిరించి ముగ్గురినీ తీసుకెళ్లారు. హైదరాబాద్ సిపీ అంజనీ కుమార్ ఇతర నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రాంఇంటికి పోలీసులు వెళ్లినా ఇంటి తలుపులు తెరువలేదు. భార్గవ్ రామ్ సోదరుడు చంద్రహాసన్ ను పోలీసులు విచారిస్తున్నారు.

కిడ్నాప్ సమాచారం అందుకున్న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. రాంగోపాల్ పేటలో రెండు వాహానాలను పట్టుకున్నారు. డైమండ్ పాయింట్, రాణిగంజ్ మీదుగా రెండు వాహనాలు వెళ్లిన దృశ్యాలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. హఫీజ్ పేటలోని వంద కోట్ల విలువైన భూమి కోసం కొంత కాలంగా గొడవ జరుగుతుందని.. ఇదే విషయంలో కిడ్నాప్ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Web TitleKidnap issue in Boinpally Hyderabad
Next Story