Mallikarjun Kharge: నేడు అలంపూర్‌, నల్గొండలో ఖర్గే పర్యటన

Mallikarjun Kharge: ఎన్నికల ప్రచారానికి అతిరథ మహారథులు

Jyothi
Published on: 22 Nov 2023 9:21 AM IST
Kharge Election Campaign In Alampur And Nalgonda today
X

Mallikarjun Kharge: నేడు అలంపూర్‌, నల్గొండలో ఖర్గే పర్యటన

Mallikarjun Kharge: ప్రచార పర్వం మరో వారం రోజులే మిగిలిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ బడా నేతలను రంగంలోకి దింపుతోంది. ఎన్నికల్లో చాలా కీలకమైన ఈ వారం రోజుల పాటు బలమైన నాయకత్వాన్ని ప్రజల్లోకి పంపడం ద్వారా ప్రచార రేసులో ఇతర పార్టీల కంటే ఎక్కడా వెనకబడ్డామనే భావన కలగకుండా ఉండేలా పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, అగ్రనేత రాహుల్‌ గాందీలతో పాటు వీలును బట్టి సోనియాగాంధీని కూడా చివరి వారంలో బరిలోకి దింపనుంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రతిరోజూ ఏఐసీసీకి చెందిన ఓ ముఖ్య నేత ప్రచారం ఉండేలా సునీల్‌ కనుగోలు టీం షెడ్యూల్‌ రూపొందిస్తోంది.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, నేతలు హర్కర వేణుగోపాల్, ఫహీమ్‌ తదితరులు స్వాగతం పలికారు.

మరోవైపు ప్రియాంకాగాంధీ కూడా ఈనెల 24వ తేదీనే తెలంగాణకు వస్తున్నట్లు తెలుస్తోంది. పాలకుర్తిలో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్న ప్రియాంక... 25, 27 తేదీల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఆమె ఈ దఫాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నట్లు సమాచారం. ఇలావుండగా సోనియాగాందీని కూడా చివరి వారంలో ఎన్నికల ప్రచారానికి తీసుకురావాలని టీపీసీసీ యోచిస్తోంది.

Jyothi

Jyothi

Next Story