Rekha Nayak: ఇప్పుడు అయితే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే..

Rekha Nayak: ఎమ్మెల్యేగా 50 రోజులు ప్రజలకు సేవ చేస్తానని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్ తెలిపారు.

Arun Chilukuri
Updated on: 21 Aug 2023 7:31 PM IST
Khanapur MLA Rekha Nayak About Her Mla Seat
X

Rekha Nayak: ఇప్పుడు అయితే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే..

Rekha Nayak: ఎమ్మెల్యేగా 50 రోజులు ప్రజలకు సేవ చేస్తానని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్ తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రేఖానాయక్ స్థానంలో జాన్సన్ నాయక్‌ ను కేసీఆర్ ప్రకటించారు. నాజీవితం ప్రజలకే అంకితమని ప్రకటించారు. తన చివరి జీవితం వరకు ప్రజలతో కలిసి ఉంటానని చెప్పారు. మిగిలిన పనులు చేస్తానని, ఇప్పుడు అయితే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని ఆమె వ్యాఖ్యానించారు. నేను ఇంకా వేరే ఆలోచించ లేదని, లాస్ట్ ఊపిరి వరకు ఖానాపూర్ లో ఉంటానని ఆమె వెల్లడించారు. ఖానాపూర్ ప్రజలే నా అమ్మానాన్న అని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారే ఆలోచన చేయలేదని, నా జీవితం ప్రజలకు అంకితమన్న రేఖానాయక్‌.. చావైనా బతుకైనా ఇక్కడే అని వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story