Rekha Nayak: జాన్సన్‌ నాయక్‌ ఎలా గెలుస్తారో నేను చూస్తా

Rekha Nayak: నేను ఎమ్మెల్యేగా ఉండగానే నిధులు నిలిపివేశారు

Shekhar G
Published on: 6 Oct 2023 4:21 PM IST
Khanapur MLA Rekha Naik Resigned From BRS
X

Rekha Nayak: జాన్సన్‌ నాయక్‌ ఎలా గెలుస్తారో నేను చూస్తా

Rekha Nayak: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. గులాబీ పార్టీకి ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర కన్నీటిపర్యంతమయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసని తనను కాదని, ఆ ప్రాంతానికే సంబంధంలేని వ్యక్తికి టికెట్‌ ఎలా కేటాయిస్తారని ఆమె ప్రశ్నించారు. కేవలం కేటీఆర్‌‌కు ఫ్రెండ్‌ కావడంతోనే జాన్సన్‌ నాయక్‌కు టికెట్‌ కేటాయించారని మండిపడ్డారు. అసలు నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి.. ఎన్ని గ్రామాలున్నాయో కూడా తెలియని వ్యక్తికి టికెట్‌ ఎలా ఇస్తారని నిలదీశారు. జాన్సన్‌ నాయక్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవనిచ్చే ఛాన్స్‌ లేదన్న రేఖానాయక్‌.. తాను ఒంటరిగానే పోటీ చేసి కచ్చితంగా గెలిచి తీరుతానన్నారు.

బీఆర్‌ఎస్‌లో మహిళలకు విలువలేదన్న రేఖానాయక్‌.. గులాబీ పార్టీ మొత్తం కుటుంబపాలనగా మారిపోయిందని విమర్శనాస్త్రాలు సంధించారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే.. తానెక్కడ మంత్రి పదవి అడుగుతానోనన్న భయంతోనే తన అడ్డు తొలగించుకున్నారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉండగానే నిధులు నిలిపేసి, 40 రోజులుగా ఎలాంటి అభివృద్ధి జరగకుండా గులాబీ పార్టీ నేతలు అడ్డుపడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గ ప్రజలు తన వెంటే ఉన్నారని, ఆ భరోసాతోనే వచ్చే ఎన్నికల బరిలో నిలుస్తానని చెప్పారు. రానున్న రెండు రోజుల్లో తాను ఏ పార్టీలో చేరుతాననే దానిపై స్పష్టత ఇస్తానన్నారు రేఖానాయక్‌.

Shekhar G

Shekhar G

Next Story