Khammam: షర్మిల వాహనం బ్రేక్‌ డౌన్‌

Khammam: ఖమ్మం సంకల్ప సభకు ర్యాలీగా వెళ్తున్న షర్మిల వాహనం టైర్‌ పంక్చర్‌ అయింది.

Arun Chilukuri
Published on: 9 April 2021 4:12 PM IST
Khammam: YS Sharmila Car Tyre Punctured
X

Khammam: షర్మిల వాహనం బ్రేక్‌ డౌన్‌

Khammam: ఖమ్మం సంకల్ప సభకు ర్యాలీగా వెళ్తున్న షర్మిల వాహనం టైర్‌ పంక్చర్‌ అయింది. సూర్యాపేట చివ్వెంల మధ్య వాహనం అగిపోయింది. దీంతో మరో వాహనంలో వెళ్లడానికి షర్మిల సిద్ధమైయ్యారు. సంకల్ప సభకు వెళ్తున్న ఆమె అడగడుగునా అభిమానులకు అభినందనలు తెలుపుతూ ముందుకు సాగుతున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌లో ఇవాళ సాయంత్రం 5గంటలకు సభ జరగనుంది.

ఇందుకోసం ఆమె లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. పంజాగుట్టలో వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించిన షర్మిల అభిమానులను కలుస్తూ ముందుకు సాగారు. మధ్యాహ్నం సూర్యాపేటలో భోజనం చేసిన తర్వాత కూసుమంచి నుంచి ఖమ్మం జిల్లా నేతలు స్వాగతం పలుకుతారు. ఖమ్మంలో భారీ ర్యాలీ ద్వారా బహిరంగ సభకు చేరుకుంటారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story