Samineni Ramarao: సీపీఎం సీనియర్‌ నేత సామినేని రామారావు దారుణ హత్య

Samineni Ramarao: ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావును దుండగులు గొంతుకోసి హత్యచేశారు.

Arun Chilukuri
Published on: 31 Oct 2025 11:17 AM IST
Samineni Ramarao: సీపీఎం సీనియర్‌ నేత సామినేని రామారావు దారుణ హత్య
X

Samineni Ramarao: సీపీఎం సీనియర్‌ నేత సామినేని రామారావు దారుణ హత్య

Samineni Ramarao: ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావును దుండగులు గొంతుకోసి హత్యచేశారు. తెల్లవారుజామున ఇంటి ఆవరణలో దుండగులు ఈ ఘాతునికి ఒడిగట్టారు. ఘటనపై సమాచారం అందుకుని పోలీస్ కమిషనర్ సునీల్‌ దత్, క్లూస్‌ టీం ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

అయితే ఈ మర్డర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలో జరగడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనపై భట్టి విక్రమార్క హత్య రాజకీయాలకు తావులేదు.. దోషులెవరైనా కఠినంగా శిక్షించాలని భట్టి విక్రమార్క ప్రకటన విడుదల చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story