Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు

Danam Nagender: బీఆర్ఎస్‌పై నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 12 July 2024 1:45 PM IST
Khairatabad MLA Danam Nagender key remarks
X

 Danam Nagender

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. BRSపై నమ్మకం లేకనే MLAలు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. ఇప్పటివరకూ 8 మంది మాత్రమే ఉన్నారని.. ఇప్పుడు మరికొందరు చేరబోతున్నారని తెలిపారు. ఇక మొత్తంగా త్వరలోనే BRSLP కాంగ్రెస్‌లో విలీనం కాబోతుందన్నారు. BRS లో MLA లను చీడపురుగుల్లా చూసేవారన్నారు. విలువ లేని చోట ఉండలేక కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు. ఫిరాయింపులపై కేసులు పెడితే పెట్టండి.. ఎంతమందిపై పెడతారో పెట్టనీయని చూద్దాం అంటూ దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. కేసులు పెడితే.. మహా ఎమ్మెల్యే పదవి పోతదేమో.. అంతేకదా..బీఆర్ఎస్‌లో చేసిన అక్రమాలు తమ దగ్గర ఉన్నాయ్ కదా.. ఈసారి తాము కేసు పెడితే.. ఆ నలుగురూ జైలుకే వెళ్తారన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story