ఖైరతాబాద్ వినాయకుడు.. ఈసారి ఇలా..!

ఖైరతాబాద్ వినాయకుడు.. ఈసారి ఇలా..!
x
Highlights

Khairatabad Ganesh: వినాయక చవితి వచ్చిందంటే చాలు అందరి దృష్టి ఖైరతాబాద్ గణేశుడిపైనే ఉంటుంది. ఏ అవతారంలో ఎంత ఎత్తులో దర్శనమిస్తాడో అని ప్రజలందరూ...

Khairatabad Ganesh: వినాయక చవితి వచ్చిందంటే చాలు అందరి దృష్టి ఖైరతాబాద్ గణేశుడిపైనే ఉంటుంది. ఏ అవతారంలో ఎంత ఎత్తులో దర్శనమిస్తాడో అని ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రాష్ట్రంలో ఏ గణపయ్యకు లేని ప్రత్యేకత ఖైరతాబాద్ గణేశుడికి ఉంది. అలాంటి విఘ్నేశ్వరుడికి ఈసారి కరోనా ఎఫెక్ట్ తగిలింది. ప్రభుత్వ ఆంక్షల మధ్య పూజలందుకోనున్న ఖైరతాబాద్ వినాయకుడిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

దేశ వ్యాప్తంగా ఖైరతాబాద్ వినాయకుడంటే ఎంతో క్రేజ్. గవర్నర్ తొలి పూజతో నవరాత్రులు ప్రారంభమవుతాయి. నిమజ్జనం కూడా అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. అయితే ఈసారి కరోనా వల్ల ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు తగ్గింది. ఒక అడుగు వినాయకుడిని పెడదామనుకున్నారు కానీ భక్తుల కోరిక మేరకు 9 అడుగుల ఎత్తు వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు ప్రజలకు ధన్వంతరి రూపంలో దర్శనం ఇస్తాడు. ఒక చేతిలో అమృతం, మరో చేతిలో ఆయుర్వేదంతో కనిపిస్తారు. వ్యాక్సిన్ తొందరగా రావాలని ధన్వంతరి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. వినాయకుడి విగ్రహం రూపొందించడానికి గుజరాత్ నుంచి మట్టిని తెప్పించామన్నారు. ఎత్తు తక్కువగా ఉండటంతో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయబోమని ఉన్న చోటే ద్రవాలతో అభిషేకం నిర్వహించి నిమజ్జనం చేస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories