Hyderabad: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహా గణపతి..

Hyderabad: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహా గణపతి..

Rama Rao
Published on: 9 Sept 2022 7:31 PM IST
Khairatabad Ganesh Nimajjanam | Hyderabad News
X

Hyderabad: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహా గణపతి..

Hyderabad: ఖైర‌తాబాద్ మ‌హా గ‌ణ‌నాథుడు గంగ‌మ్మ ఒడికి చేరాడు. తొమ్మిది రోజులు ఘ‌నంగా పూజ‌లు అందుకున్న పంచ‌ముఖ మ‌హాల‌క్ష్మి గ‌ణ‌నాథుడికి గంట‌న్న‌ర పాటు పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం హుస్సేన్ సాగ‌ర్‌లో గ‌ణ‌నాథుడిని నిమ‌జ్జ‌నం చేశారు. స‌రిగ్గా రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. మ‌హా గ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ‌ను వీక్షించేందుకు భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ‌ను చూసి భ‌క్తులు పుల‌కించిపోయారు.

గ‌ణ‌నాథుడికి ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. దీంతో హుస్సేన్ సాగ‌ర్ ప‌రిస‌ర ప్రాంతాలు గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా నినాదాల‌తో హోరెత్తిపోయాయి. ఖైర‌తాబాద్ నుంచి టెలిఫోన్ భ‌వ‌న్ మీదుగా హుస్సేన్ సాగ‌ర్ వ‌ర‌కు 6 గంట‌ల‌కు పైగా శోభాయాత్ర కొన‌సాగింది. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబ‌ర్ 4 వ‌ద్ద ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించారు.

Rama Rao

Rama Rao

Next Story