Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతికి కాసేపట్లో గవర్నర్ తమిళిసై తొలిపూజ

Khairatabad Ganesh: కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్రమంత్రులు

Arun Chilukuri
Published on: 10 Sept 2021 11:29 AM IST
Khairatabad Mahaganapati first puja will be started by Governor Tamilisai
X

ఖైరతాబాద్ గణపతి (ఫోటో ది హన్స్ ఇండియా )

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళిసై కాసేపట్లో తొలిపూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొనున్నారు. ఈ ఏడాది పంచముఖ రుద్ర మహా గణపతిగా ఖైరతాబాద్ గణేష్ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 40 అడుగుల గణనాథుడికి కుడివైపున కాల నాగేశ్వరీ, ఎడమవైపు కృష్ణకాళీ అమ్మవారు ఉన్నారు. చవితిని పురస్కరించుకుని మహాగణపతిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story