TSPSC: TSPSC నిందితుల విచారణలో కీలక అంశాలు.. ఏఈ పేపర్ లీక్‌లో కేతావత్ రాజేశ్వర్ కీలక పాత్ర

TSPSC: రూ. 25 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్న రాజేశ్వర్

Dhatripriya
Published on: 3 April 2023 10:14 AM IST
Key Points In The Investigation Of TSPSC Leakage Case
X

TSPSC: TSPSC నిందితుల విచారణలో కీలక అంశాలు.. ఏఈ పేపర్ లీక్‌లో కేతావత్ రాజేశ్వర్ కీలక పాత్ర

TSPSC: TSPSC నిందితుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఈ పేపర్ లీకేజీ కేసులో కేతావత్ రాజేశ్వర్ కీలక పాత్ర పోషినట్లు భావిస్తున్నారు. మూడు ఏఈ పేపర్లను 40 లక్షల రూపాయలకు రాజేశ్వర్‌ అమ్మినట్లు గుర్తించారు. 25 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్న రాజేశ్వర్.. మిగతా నగదు.. ఎగ్జామ్ రిసల్ట్స్ వచ్చిన తర్వాత ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. రేణుకకు పేపర్ లీక్ చేసిన ప్రవీణ్.. నమ్మకమైన వారికే అమ్మాలని సూచించాడు. 10 లక్షలకు ప్రవీణ్... రేణుకతో బేరం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా 5 లక్షలు తీసుకున్నాడు. ఈ విషయాన్ని రేణుక భర్త..తమ సమీప బంధువు రాజేశ్వర్‌కి చెప్పాడు. అయితే మధ్యవర్తులు గోపాల్, నీలేష్, ప్రశాంత్, రాజేంద్ర కుమార్‌లకు 40 లక్షల రూపాయలకు పేపర్‌ను విక్రయించాడు రాజేశ్వర్.

Dhatripriya

Dhatripriya

Next Story