Telangana: బీసీ కులగణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana: మూడు నెలల్లో బీసీ కులగణన చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 Sept 2024 1:15 PM IST
Key orders of Telangana High Court on BC Caste Census
X

Telangana: బీసీ కులగణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana: రాష్ట్రంలో బీసీ కులగణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లో బీసీ కులగణన చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కులగణన చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం. బీసీ కులగణన చేయాలంటూ బీసీ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది హైకోర్టు. పిటిషనర్ తరపున నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. అడ్వకేట్ జనరల్ కూడా సానుకూలంగా స్పందించారని పిటిషనర్ తరపు లాయర్ స్పష్టం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story