CM KCR: సికింద్రాబాద్‌ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్‌

CM KCR: ఉజ్జయిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్‌

Jyothi
Published on: 9 July 2023 2:03 PM IST
KCR visited Ujjaini Mahankali Temple
X

CM KCR: సికింద్రాబాద్‌ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్‌

CM KCR: సీఎం కేసీఆర్‌ దంపతులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. ఆలయ అర్చకులు కేసీఆర్‌ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత మహంకాళిని దర్శించుకొని బంగారు బోనం సమర్పించారు.

మహంకాళి అమ్మవారి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రభుత్వం ప్రతిఏటా వైభవంగా నిర్వహిస్తోంది. ఆషాఢమాసంలో గ్రామదేవతలను పూజిస్తూ.. ప్రారంభమయ్యే ఈ బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనం. స్థానికులు డబ్బుచప్పుళ్లతో నెత్తిన బోనమెత్తి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. ప్రజల వేషభాషలను ప్రతిబింబిస్తూ వారిలో ఐక్యత పెంపొందించేలా బోనాల పండగ సాగుతుంది.

Jyothi

Jyothi

Next Story