KCR: కారు జోరు.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన

KCR: నేడు సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం

Shekhar G
Published on: 19 Nov 2023 10:38 AM IST
KCR Visit To The Joint Mahabubnagar District
X

KCR: కారు జోరు.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన

KCR: బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. గులాబీ బాస్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అలంపూర్‌, కొల్లాపూర్, నాగర్‌ కర్నూలు, కల్వకుర్తి నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగిస్తారు. మంత్రి కేటీఆర్ ఇవాళ ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని గ్రాండ్ కాకతీయలో మహిళలతో ఇంట్రక్షన్ నిర్వహిస్తారు. 11 గంటలకు భద్రాచలంలో రోడ్ షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1గంటకు ఇల్లందులో రోడ్ షో, 2.30 గంటలకు కొత్తగూడెంలో రోడ్ షో, 4 గంటలకు అశ్వరావుపేటలో రోడ్‌లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.

ఇంకా ఇవాళ సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు, పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వనపర్తిలో నిరంజన్ రెడ్డి, సికింద్రాబాద్‌లో మంత్రి తలసాని, కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్, నల్గొండ జిల్లాలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

Shekhar G

Shekhar G

Next Story