CM KCR: ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్‌లో కేసీఆర్ పర్యటన

CM KCR: హ్యాట్రిక్ లక్ష్యంగా దూసుకుపోతున్న సీఎం కేసీఆర్‌

Jyothi
Updated on: 7 Nov 2023 9:00 AM IST
KCR Visit to Adilabad and Karimnagar Today
X

CM KCR: ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్‌లో కేసీఆర్ పర్యటన

CM KCR: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచారంలో జోరు సాగిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లేలా నేతలు ప్రణాళికలు రచించి ప్రచారాల్లో జోరు పెంచారు. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ.. అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశాలను ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ టాప్ గేర్ ప్రచారంలో దూసుకుపోతోంది.

అధికారమే లక్ష్యంగా.. సంక్షేమమే నినాదంగా బీఆర్ఎస్ ప్రజల్లోకి దూసుకెళ్తుంది. ఇప్పటికే అధికారంలో ఉన్న కారు సర్కారు.. గేరు మార్చి స్పీడు పెంచింది. వినూత్న రీతిలో ప్రచారాలను చేపడుతుంది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని.. భవిష్యత్ లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సీఎం కేసీఆర్‌ నిర్వహిస్తున్న వరుస సభల్లో చెప్పుకొస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ టీమ్‌ సైతం ఇదే వైఖరిని అవలంభిస్తూ ప్రజల్లోకి బీఆర్ఎస్‌ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story