కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్‌ పరామర్శ

Arun Chilukuri
Updated on: 22 Jun 2020 4:51 PM IST
కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్‌ పరామర్శ
X

భారత్ చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. ఇవాళ రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ సూర్యాపేట వెళ్లారు. ముందుగా సంతోష్ ‌బాబు చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. క‌ల్న‌ల్ సంతోష్ భార్య సంతోషితో మాట్లాడిన కేసీఆర్‌.. ఆమెకు గ్రూప్ వ‌న్‌ జాబ్ అపాయింట్ ఆఫ‌ర్‌ను అంద‌జేశారు. అంతేకాకుండా కుటుంబానికి అయిదు కోట్ల‌ రూపాయ‌ల చెక్‌ను కూడా అంద‌జేశారు. జూబ్లీ హిల్స్‌లో 700 గ‌జాల ఇంటి స్థ‌లాల ప‌త్రాల‌ను కూడా సీఎం కేసీఆర్‌.. క‌ల్న‌ల్ సంతోష్ కుటుంబానికి అంద‌జేశారు. సీఎంతో పాటు మంత్రి జగదీశ్ రెడ్డి, అధికారులు సూర్యాపేటకు వెళ్లారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story