CM KCR: ఇది గోల్‌మాల్‌ బడ్జెట్‌.. జబ్బలు చరుసుకోవడం తప్ప..

Union Budget 2022: కేంద్ర బడ్జెట్‌పై సీఎం కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 1 Feb 2022 2:43 PM IST
KCR Unhappy Over Union Budget 2022
X

CM KCR: ఇది గోల్‌మాల్‌ బడ్జెట్‌.. జబ్బలు చరుసుకోవడం తప్ప..

Union Budget 2022: కేంద్ర బడ్జెట్‌పై సీఎం కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను బడ్జెట్‌ నిరాశపరిచిందన్న ఆయన ఇది గోల్‌మాల్‌ బడ్జెట్‌ అన్నారు. వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్‌ బిగ్‌ జీరో చుట్టిందని, నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు లేవని విమర్శించారు సీఎం. ఉద్యోగులను, చిరు వ్యాపారులను తీవ్ర నిరాశకు గురిచేసిందని, దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని ఆశ్చర్యానికి గురయ్యారు సీఎం కేసీఆర్. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు దశ, దిశ లేదని, బడ్జెట్‌ మొత్తం మాటలగారడీలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం జబ్బలు చరుసుకోవడం తప్ప ఉపయోగం లేదన్నారు సీఎం కేసీఆర్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story