CM KCR: నేను మాట్లాడే మాటలు హుజూరాబాద్‌లో వింటున్నారు.. సీఈసీ చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి..

KCR Unanimously Elected as TRS President
x

CM KCR: నేను మాట్లాడే మాటలు హుజూరాబాద్‌లో వింటున్నారు.. సీఈసీ చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి.. 

Highlights

CM KCR: హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో టీఆర్‌ఎస్ ప్లీనరీ అట్టహాసంగా జరిగింది.

CM KCR: హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో టీఆర్‌ఎస్ ప్లీనరీ అట్టహాసంగా జరిగింది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ హాజరై టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. టీఆర్‌ఎస్ ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహించిన సభకు అనుమతి ఉన్న ప్రతినిధులతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో హైటెక్స్‌లో సందడి నెలకొంది. సభా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి ప్లీనరీ వేదికగా ప్రకటించారు. అనంతరం సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. తెలంగాణ ఉద్యమంపై ఆనాడు ఉన్న అనుమానాలు, అపోహలు, దుష్ప్రచారాలు మధ్య గులాబీ జెండా ఎగిరిందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ వారికి పాలన చేతకాదని అవమానించారని, అనేక దుష్ప్రచారం చేశారని కేసీఆర్ అన్నారు. నేడు అనేక రంగాల్లో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉందని చెప్పారు.

కేంద్ర ఎన్నికల సంఘంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ కూడా రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తుందని ధ్వజమెత్తారు. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వ్యవహరించాలని, గౌరవాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. చిల్లరమల్లర ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరిస్తున్నానని చెప్పారు. కేసీఆర్ సభ పెట్టవద్దని ఎలా చెబుతారని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలన్న కేసీఆర్.. నేను మాట్లాడే మాటలు హుజూరాబాద్‌లో వింటున్నారన్నారు.

నవంబర్ 4 తర్వాత దళిత బంధును ఎవరూ ఆపలేరని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా దళిత బంధు అమలు చేస్తామని స్పష్టం చేశారు. హుజురాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలిచి తీరుతాడని, గెల్లు శ్రీనివాస్‌ను హుజూరాబాద్ ప్రజలు దీవించి, ఆశీర్వదిస్తారు. రాష్ట్రమంతటా దళిత బంధును అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రం విడిపోతే చీకట్లోకి వెళ్లిపోతుందని ఆనాడు అన్నారని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చీకట్లు ఉంటే తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తోందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories