CM KCR: రెండోవిడత ప్రచారంలో టాప్‌ గేర్‌లో దూసుకుపోతున్న కేసీఆర్‌

CM KCR: ఇవాళ నాలుగు సభల్లో పాల్గొననున్న గులాబీ దళపతి

Jyothi
Published on: 16 Nov 2023 8:51 AM IST
KCR Tour in Adilabad, Nizamabad Rural, Narsapur
X

CM KCR: రెండోవిడత ప్రచారంలో టాప్‌ గేర్‌లో దూసుకుపోతున్న కేసీఆర్‌

CM KCR: గులాబీ బాస్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటిస్తూ.. ఎన్నికల ప్రచారం చేస్తూ.. ప్రతిపక్షాలకు కౌంటర్‌ ఇస్తున్నారు. ఇక.. రెండోవిడత ప్రచారంలో భాగంగా కారు స్పీడ్‌ పెంచారు గులాబీ దళపతి. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఇవాళ నాలుగు చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఆదిలాబాద్‌, బోథ్‌, నిజామాబాద్‌ రూరల్‌, నర్సాపూర్‌లో ఇవాళ సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

Jyothi

Jyothi

Next Story